శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి లో సీనియర్ నాయకుడు చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని, ఆయనను మించిన భక్తుడు లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






