శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): కార్మిక వర్గానికి, భారత ప్రజానీకానికి ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు.140వ మే డే సందర్భంగా హైదర్ నగర్ లోని అంబేడ్కర్ సెంటర్ లో పార్టీ హైదర్ నగర్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల పాలనలో తమ మనువాద పాలన అవసరాల కోసం అనేక రాజ్యాంగ చట్టాలను సవరించిందని అన్నారు. దానిలో ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను నివారించి నాలుగు ప్రమాదకరమైన లేబర్ కోడ్ లను అమలు చేస్తుందని ఆరోపించారు. శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో హైదర్ నగర్ డివిజన్ కన్వీనర్ ఇక్రాన్ షేక్, ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్, ఏఐఎఫ్ డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, యూపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షుడు మైదం శెట్టి రమేష్, ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏఐఎఫ్ డి డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ పుష్ప, తాండ్ర కళావతి, వి తుకారాం నాయక్, ఇస్లావత్ దశరథ్ నాయక్, కర్ర దానయ్య, శివాని నర్సింహా , విమల, జి లలిత, మధుసూదన్, భూసాని రవి, అరుణ, ఇషక్, హైదర్ నగర్ డివిజన్ స్థానికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






