- సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డికి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వెస్ట్ జోన్ పరిధిలో ఓ బిల్డర్ చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డికి జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఓ బిల్డర్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ తన కుటుంబ సభ్యుల పేరు మీద గతంలో 300 మందికి పైగా మోసం చేశాడని అన్నారు. తిరిగి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూ, అధికారులనూ, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడని భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారుడు.

చందానగర్ సర్కిల్ 21 పరిధిలో తన కూతురు పేరుతో స్టేటస్ కో ఆర్డరును ఉల్లంఘించి నిర్మాణం పూర్తి చేశాడని, అధికారులు లాలూచీ పడి సహకరించారని అన్నారు. సర్కిల్ 20 పరిధిలో తన కొడుకు పేరుతో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ నిర్మాణం చేయడంతోపాటు, అక్రమ సెల్లార్, సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణాన్ని నిర్మించడం జరుగుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గతంలో తమ ఫిర్యాదులకు అధికారులు నోటీసులిచ్చినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుందని అన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ ప్లానర్ చర్యలకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ఫిర్యాదును జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్, జోనల్ కమిషనర్, సర్కిల్ 20, 21 డిప్యూటీ కమిషనర్లు, ఏసీబీ, డీజీపీ, సైబరాబాద్ సీపీలతోపాటు సంబంధిత అధికారులు అందరికీ అందజేయడం జరిగిందని కసిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.





