చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న ఓ మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మంగళవారం డీసీ సుధాంష్‌కు ఫిర్యాదు చేశారు. సదరు మాజీ కౌన్సిలర్ ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేస్తున్నాడని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని భాస్కర్ రెడ్డి ఈ సందర్బంగా డీసీని కోరారు. అలాగే ఈ విషయంపై ఆధారాలతో సహా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, తెలంగాణ ఏసీబీ, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ విభాగం, ఆర్‌డీవో, జోనల్ కమిషనర్, నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ, శేరిలింగంపల్లి తహసీల్దార్‌లకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.






