శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఆదివారం చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారికి పోలియో రాకుండా కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలనీలలోని కమ్యూనిటీ హాల్ లలో, ముఖ్య కూడళ్లలో, బస్సు స్టాప్స్ వద్ద, రైల్వే స్టేషన్స్ వద్ద, మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
