నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి ఎం ఏ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్మిత దంత వైద్యశాల వారి సహకారంతో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నీటితో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలని సూచించారు. దంత సమస్యలు ఏర్పడినప్పుడు మనం తీసుకునే ఆహారం పూర్తిగా నమల లేకపోవడం వల్ల, జీర్ణం కాక, అజీర్తితో అనేక ఉదరకోశ వ్యాధులు రావడానికి కారణం అవుతుందని అన్నారు. కాలక్రమేణా కిడ్నీ, లివర్, గుండె తదితర అవయవాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. కావున ఎటువంటి దంత సమస్యలు ఉన్నా అశ్రద్ధ చేయకుండా కుటుంబ దంత వైద్యులను సంప్రదించి దంతాలను సంరక్షించుకోవాలని తెలిపారు. అనంతరం టూత్ ఫేస్ట్ లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యరేఖ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కొక్కుల జనార్ధన్, కౌండిన్య, నండూరి వెంకటేశ్వరరాజు, పాలం శ్రీను, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.