నమస్తే శేరిలింగంపల్లి: కార్పెంటర్ హత్యకు గురైన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన ప్రేమ్ రామ్ (28) అనే వ్యక్తి కార్పెంటర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. సిద్దిఖ్ నగర్ వీధి నంబర్ 8 లోని మౌలానా అనే వ్యక్తి గదిలో అద్దెకు ఉంటున్నాడు. తాను ఉంటున్న రూంలోనే ప్రేమ్ రామ్ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇంటి యజమాని మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.