నమస్తే శేరిలింగంపల్లి:కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో నూతనంగా ఏర్పడిన కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, కాలనీ వాసులందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాలనీ లో రోడ్డు నంబర్ 2,3,4 గల రోడ్ల నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజి, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన విప్ గాంధీ త్వరలోనే డ్రైనేజి , రోడ్లు వంటి మౌలిక వసతులు కలిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి,సిద్దిక్ నగర్ వాసులు బసవ రాజు , యాదగిరి గౌడ్ , నందు, రాములు, లక్ష్మీ బాయి, గోపాల్ గౌడ్, మహేష్, మనెమ్మ, పాతిమా తదితరులు పాల్గొన్నారు.