నమస్తే శేరిలింగంపల్లి: అక్రమ అరెస్టులు, నిర్భందాలు న్యాయమైన డిమాండ్ల కోసం చేసే ఉద్యమాలను ఆపలేవని ఆల్ ఇండియా ఫెడరేషన్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ (ఏఐఎఫ్ డిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. శుక్రవారం డైవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన ప్రగతి భవన్ ను ముట్టిడిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాశి, జబ్బర్ నాయక్ తదితరులు ఉన్నారు.