నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం గౌతమీ నృత్యాలయ గురువు డాక్టర్ గౌతమి రవి చంద్ర శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన చేశారు. పుష్పాంజలి, మహాదేవసుతం, నటేశ కౌతువం, జతిస్వరం, సాధించెనే, తక్కువేమి, శ్రీ రామ నీ నామము , రంజని కంజదళాయ, సతులారా, గోవర్ధన నటనం, ఓనం సాంగ్ , వందే మాతరం అంశాలపై చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాకారులు మేధా , గౌతమీ, గాయత్రీ , భావన , వర్షిణి , తరుణీ , సహాయ , సిరి, రితిక, చందన, భావన లు నృత్య ప్రదర్శనలు చేసిన వారిలో ఉన్నారు.






