శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలి సేవా సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన, రుద్రపారాయణం నిర్వహించారు. అనంతరం హారతి, తీర్థ, ప్రసాదాల వితరణ చేపట్టారు. సాయంత్రం భజనలు, బాలవికాస్ విద్యార్థులచే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కేక్ కటింగ్, మంగళహారతి, తీర్థ, ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు రాహుల్ సాగర్, K ప్రదీప్, జానకీ బలరామ్, B ఆనంద్, B వెంకట్రావు, D V కృష్ణారావు, తాడిబోయిన రామస్వామి యాదవ్, మూర్తి, రామారావు, కృష్ణ కుమార్, హలో బాల వికాస్ గురువులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






