మ‌క్తాలో ర‌హ‌దారిపై గుంత‌ల‌ను పూడ్చాల‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు రోహిత్ ముదిరాజ్ విన‌తి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని మ‌క్తా ర‌హ‌దారిలో మున్సిప‌ల్ సిబ్బంది త‌వ్వి వ‌దిలేసిన గుంత‌ల‌ను పూడ్చాల‌ని కోరుతూ ఆయువ్ స్టూడెంట్స్ యూత్ వ్య‌వ‌స్థాప‌కుడు రోహిత్ ముదిరాజ్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ స‌ద‌రు ర‌హ‌దారిలో మున్సిప‌ల్ సిబ్బంది గుంత‌ల‌ను తవ్వి పూడ్చ‌కుండా అలాగే వ‌దిలేశార‌ని, అది చూసుకోకుండా పాద‌చారులు, వాహ‌న‌దారులు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. క‌నుక గుంత‌ల‌ను వెంట‌నే పూడ్చే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించాల‌ని కోరారు. ఇందుకు కార్పొరేట‌ర్ శ్రీ‌కాంత్ సానుకూలంగా స్పందించారు. స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here