శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్ లో పలు ఫలహారం బండ్ల, తొట్టెల ఊరేగింపుల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ ఈ ఊరేగింపుల్లో పాల్గొన్నారు. డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, అడుగడుగునా భక్తుల నీటి సాకల మధ్య ఊరేగింపును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా కొద్ది సేపు నృత్యం చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి విలేజ్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.






