శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్(RP) కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1 కోటి 16 లక్షల 16 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు జలమడలి అధికారులు, మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో UGD నిర్మాణ పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, జిఎం హరిశంకర్, డిజిఎం శ్రీనివాసరాజు, మేనేజర్ అనిల్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






