శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ స్పీడ్ పోస్ట్ 24/7 (డిజిటల్) ప్రచార రథాన్ని పోస్ట్ మాస్టర్ వెంకటేష్ తో కలిసి బీజేపీ నాయకులు ప్రారంభించారు. గత మూడు నెలల క్రితం చందానగర్ పోస్ట్ ఆఫీస్ షిఫ్ట్ చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులకు కోరారు. అధికారులు స్పందించి హుడా కాలనీ రోడ్డులోని భవనానికి పోస్ట్ ఆఫీస్ ను మార్చారని అన్నారు. సమస్యను పరిష్కరించాలని తెలిపిన వెంటనే స్పందించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, బీజేపీ నాయకులకు పోస్ట్ మాస్టర్ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, సీనియర్ నాయకులు గొల్లపల్లి రాంరెడ్డి, వనం శ్రీనివాస్, చందానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, చందానగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, బీజేపీ నాయకుడు కిరణ్ పాల్గొన్నారు.






