నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ వాసులు పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో సీసీ రోడ్లు, మంచి నీటి సమస్య, పార్క్ ను అభివృద్ధి చేయాలని కోరారు. త్వరలోనే కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైమండ్ హైట్స్ కాలనీ వాసులు రామారావు, గంగాధర్, వంశీ కృష్ణ, సుందర్ చారీ, అశోక్, లక్ష్మణ్ రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
