శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా రెండో సారి గెలుపొందిన సందర్భంగా ఆదర్శ్ నగర్, రెజెంటా పార్కులో రాగం నాగేందర్ యాదవ్ కి మహిళలు, కాలనీ వాసులు, రెజెంటా పార్కు వాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, జాతీయ అధికారిక భాషా సలహా సంఘం సభ్యుడు మిరియాల రాఘవ రావు, రమణ మూర్తి, ముజీబ్, శ్రీనివాస్, తంబీ, ప్రసాద్, శివయ్య గౌడ్, బాలన్న, జీవీ రావు, చారి, శివరామకృష్ణ, బాపిరాజు, మోహనరావు, సత్యనారాయణ, సునిల్, ఆదర్శ్ లేడీస్ వెల్పేర్ అసోసియేషన్ నిర్వాహకులు స్వరూప, దీప, నాగరాణి, వీణ, లక్ష్మీ నాయుడు, లత, సుజాత, రెజెంటా పార్కు అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు.