హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ జానకి రామరాజు మంగళవారం మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జానకి రామరాజు మంత్రి కేటీఆర్‌ను కలిసి డివిజన్ పరిధిలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.






