22ఏ భూముల సమస్యపై కేటీఆర్, హరీష్‌రావుకు వినతి

శేరిలింగంప‌ల్లి, సెస్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 22ఎ జాబితాలో చేర్చిన భూములను ప్రభుత్వం వెంటనే విముక్తి చేయాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన బాధితులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శాసనమండలి సభ్యుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల వారి జీవితాలు, ఆస్తులపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో 22ఏ జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 22ఏ భూముల సమస్యపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సురభి కాలనీ, అరంభ్‌ టౌన్‌షిప్, గోపీనగర్, ఆదర్శ్‌నగర్, బాపునగర్, శ్రీరామ్‌నగర్ కాలనీ ఏ, బీ, సీ బ్లాక్ జేఏసీ, రాఘవేంద్ర కాలనీ, సెంట్రల్ పార్క్ ప్రాంతాలకు చెందిన బాధితులతో పాటు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, రవి యాదవ్, విజయ్ రెడ్డి, అనిల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కిరణ్ యాదవ్, నరేందర్ యాదవ్, లక్ష్మీనారాయణ, రోజా, మమత, గోపు శ్రీనివాస్, మల్లారెడ్డి, సంగారెడ్డి, రామకృష్ణ, అల్లావుద్దీన్, సంతోష్, నక్క శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, రాహుల్, వెంకటేష్ యాదవ్, వెంకట్రావు, కృష్ణ గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here