22 కుటుంబాలకు రూ.14.91 లక్షల CMRF సాయం

శేరిలింగంప‌ల్లి, సెస్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న 22 మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ.14,91,300 ఆర్థిక సాయాన్ని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక స‌హాయం కోరుతూ పలువురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం మంజూరు చేసిన CMRF చెక్కులను గాంధీ బాధిత కుటుంబాలకు అందించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు CMRF ఆపన్నహస్తంలా నిలుస్తోందని గాంధీ తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, జంగయ్య యాదవ్, చంద్రారెడ్డి, ఎండీ ఇబ్రహీం, జిల్లా గణేష్, క్రాంతి, మల్లయ్య, గోపాల్, శివసాగర్, సల్లాఉద్దీన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here