మదీనాగూడ విలేజ్ లో ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): సంక్రాతి పర్వదిన ఉత్సవాలలో భాగంగా మదీనాగూడ విలేజ్ లో స్థానిక నాయకుడు జీడిగింజల వెంకటేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హఫీజ్ పేట్ యువనాయకుడు ధాత్రీనాథ్ గౌడ్, ఆయ‌న సతీమణి సింధు ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు, అలాగే పోటీలో పాల్గొన్న దాదాపు 50 మంది పోటీదారులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య ముదిరాజ్, మల్లేష్ యాదవ్, జంగయ్య, జనార్దన్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, బాబూమోహన్ మల్లేష్, అశోక్ గౌడ్, బీరప్ప, రమేష్, బాలరాజ్, ఎల్లారావు, రవి వద్దిరాజ్, ఆశ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here