రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టండి – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ పొంగి వర్షం నీరు వెళ్లకుండా రైల్వే బ్రిడ్జి కింద నిల్వడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతుందని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండకుండా వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కారణంగా వర్షం నీరు, డ్రైనేజీ నీరు నిల్వకుండా తక్షణ చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి హెరిటేక్ మిషన్, జేసీబీతో మెయిన్ పైప్ లైన్ లో, అంతర్గత రోడ్డు మధ్యలో గల మ్యాన్ హోల్స్ లో పేరుకుపోయిన ఇసుక, మట్టి, వ్యర్ధాలను దగ్గరుండి తొలగింపజేశారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ సోమదాస్, వాటర్ వర్క్స్ డీజీఎం సి. నారాయణ, ఏరియా మేనేజర్ యాదగిరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ మోహన్ నాయక్, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, సుమన్,మల్కయ్య, జీహెచ్ఎంసీ, సిబ్బంది ఉన్నారు.

జేసీబీ సహాయంతో మ్యాన్ హోల్స్ లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగింపజేస్రున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here