నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కి చెందిన నాగరాజుకు మంజూరైన సెంట్రింగ్ సామాగ్రి ని, మాదాపూర్ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన భుజంగంకు మంజూరైన ఎరిటిగా కారును కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం దశల వారీగా పూర్తి స్థాయిలో అమలు అవుతుందన్నారు.

ఈ ఏడాది 2 వేల మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందిన నాగరాజు, భుజంగం సంతోషం వ్యక్తం చేస్తూ తమకు ఉపాధి అవకాశం కల్పించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, సంగారెడ్డి, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, రఘునాథ్, విమల్ కుమార్, సయ్యద్ గౌస్, సీతారాం, శోభన్, యాదగిరి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
