చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి జాతీయ అధికారిక భాషా సలహా సంఘం సభ్యుడు, తెరాస సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గాంధీని ఆయన స్వగృహంలో కలిసిన రాఘవరావు ఆయనకు మొక్కను బహుకరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమదాసు, సుబ్బారావు, నాయకులు పాల్గొన్నారు.
