ఆల్విన్ కాలనీలో ఘ‌నంగా ద‌స‌రా వేడుక‌లు

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్‌ నగర్ లో దసరా పండుగ‌ను పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడిగాంధీ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడిగాంధీ

ఈ సంద‌ర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా ద‌స‌రాను జ‌రుపుకుంటార‌ని అన్నారు. అదే రోజున రావ‌ణ ద‌హ‌నం చేస్తార‌న్నారు. ద‌స‌రా రోజు ప్రారంభించే ఏ ప‌ని అయినా విజ‌యవంతం అవుతుంద‌ని అన్నారు. క‌రోనా నుంచి ప్ర‌జ‌ల‌ను అమ్మ‌వారు కాపాడాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాల‌తో సంతోషంగా జీవించాల‌ని కోరుకున్నాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ అంద‌రికీ జ‌మ్మి పంచారు. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడిగాంధీ

వివేకానంద‌న‌గ‌ర్‌లో…

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాయితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, తెరాస నాయకులు మాధవరం రామారావు, నాయినేని చంద్రకాంత్ రావు, వేణు, అనిల్, మల్లేష్, ప్రవీణ్, స్థానికులు పాల్గొన్నారు.

వివేకానంద‌న‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్ ల‌క్ష్మీబాయితో క‌లిసి శ‌మీ వృక్షానికి పూజ‌లు చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
వివేకానంద‌న‌గ‌ర్‌లో రావ‌ణ ద‌హ‌నం నిర్వ‌హిస్తున్న దృశ్యం

కూక‌ట్‌ప‌ల్లిలో…

కూక‌ట్‌ప‌ల్లి డివిజన్ ప‌రిధిలోని ఆస్బెస్టాస్ కాల‌నీలో ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్బంగా నిర్వ‌హించిన రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగా రావు, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, నాగేశ్వర్ రావు, చంద్రారెడ్డి, అబుల్, కృష్ణ, ప్రసాద్, దేవదాస్, ఖయ్యుమ్, భాస్కర్ రెడ్డి, షరీఫ్, శ్రీధర్ రెడ్డి, పద్మ, స్థానికులు పాల్గొన్నారు.

ఆస్బెస్టాస్ కాల‌నీలో రావ‌ణ ద‌హ‌నాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here