పొగాకు వాడేవారు తమను తాము నియంత్రించుకోవాలి: మియాపూర్ సీఐ తిరుపతి రావు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1982 నుండి ఒక నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. పొగాకు ఉత్పత్తులు, తాగటం , తినటం పీల్చడం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మాన్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను కోల్పోవచ్చన్నారు. ప్రాణ నష్టంతో పాటు ఆర్ధిక నష్టం జరుగుతుందని, భారత దేశం లో అధిక మరణాలకు పొగాకు వినియోగమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలుతెలియజేస్తున్నాయన్నారు. గుండెపోటు, బ్రైన్ స్ట్రోక్ , ఊపిరి తిత్తుల వ్యాధి, మంట, శ్లేష్మ, టిబి, ఊపిరి తిత్తుల కాన్సర్ తో పాటు ఇతర కాన్సర్, అంధత్వం, గమ్ ఇన్ఫెక్షన్లు, దంత క్షయం లాంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఒంగూరి శ్రీనివాస్ యాదవ్, కౌండిన్య, నండూరి వేంకటేశ్వర రాజు, గంగాధర్, జిల్ మల్లేష్ , జీవీ రావు , జనార్ధన్, సాంబశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here