నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా కార్యక్రమాల్లో అవని స్వచ్ఛంద సంస్థ ముందంజలో ఉండడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ తో కలిసి అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూరు సహకారంతో పేద విద్యార్థిని బేబీ ప్రణీత స్కూల్ ఫీజు కోసం రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. పేద విద్యార్థులకు బాసటగా నిలవడం అభినందనీయమని అన్నారు. అవని స్వచ్ఛంద సంస్థ మున్ముందు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజా రంగారావు తదితరులు ఉన్నారు.