నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో పదిహేను రోజుల నుండి నిర్వహిస్తున్న సమ్మర్ ఫెస్టివల్ క్యాంపు ముగిసింది. ఈ ఫెస్టివల్ క్యాంపులో దాదాపు 65 మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్లకి కుండలు తయారు చేయడం, మట్టి బొమ్మలు, అక్రిలిక్ పెయింటింగ్, మధుబని పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, భగవత్ గీత శ్లోకాలు అంశాలలో శిక్షణ ఇచ్చారు. ముగింపు రోజున తయారు చేసిన వాటిని ప్రదర్శనలో పెట్టారు. శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఇంజనీర్ కన్సల్టెంట్ అంజిరెడ్డి ప్రతి ఒక్కరికి ప్రశంసాబపత్రాలు ఇచ్చి ప్రోత్సహించారు.