క్రీడ‌ల‌తో శారీర‌క‌, మాన‌సిక ఉల్లాసం: కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయ‌ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్‌షిప్ 2024 పోటీలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివ సేన రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు.

పోటీల‌ను ప్రారంభిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ తైక్వాండో, కరాటే, కుంఫు లాంటి క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ సామర్ధ్యాన్ని పెంచుతాయని అన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల తలిదండ్రులు ఇలాంటి క్రీడలు నేర్చుకునేలా త‌మ పిల్ల‌ల‌ను ప్రోత్సహించాలని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు. పాల్గొన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here