శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకుడు సత్యనారాయణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సర కాలంలో నిత్యనూతన ఉత్సాహంతో, చిరునవ్వుతో ఉండాలని , ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని, ప్రజలు చేయబోయే ప్రతి కార్యంలో విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.






