శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీ,హెచ్ఎంటి కాలనీ, ముజాఫర్ అహ్మద్ నగర్, న్యూ కాలనీ, శ్రీల గార్డెన్ కాలనీల వాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ.. ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సర కాలంలో నిత్యనూతన ఉత్సహాంతో, చిరునవ్వుతో ఉండాలని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ వాసులు, శ్రీల గార్డెన్ కాలనీవాసులు, నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీవాసులు, న్యూకాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






