నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నియో ఆసియన్ క్లినిక్స్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత ప్రజల కోసం మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ తో పాటు డా. ఘంటా రామిరెడ్డి, డా. సాయి కిరణ్ తిప్పర్తి, డా. అనుదీప్ శ్రీరామ్, డా పొనగంటి నిశాంత్, తిపర్తి రఘు, బాలిరెడ్డి, కె.జయ లక్ష్మి, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, గోల్డెన్ తులిప్ కాలనీ ప్రెసిడెంట్ విద్యాసాగర్, సెక్రటరీ ఎస్వీ యన్ రాజు, సాయి శామ్యూల్ కుమార్, నరేష్ ముదిరాజ్, దీపక్, కరీం తదితరులు పాల్గొన్నారు.