శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి) డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. నెహ్రూనగర్ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి ఆయన సూచించారు. నెహ్రూనగర్, గోపీనగర్, బాపునగర్ లలో రోడ్లపై, ఇళ్ల మధ్య ఉన్న చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలను జీహెచ్ఎంసీ వాహనాల ద్వారా దూరప్రాంతాలకు తరలించి రోడ్లన్నీ శుభ్రంగా ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు.

అనంతరం నెహ్రూ నగర్ లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట వార్డు మెంబర్ పర్వీన్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, నెహ్రూనగర్, గోపీనగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షులు గఫూర్, గోపాల్, నాయకులు ఆంజనేయులు, రవీందర్, సైదులు, హైమావతి, గిరిజ, లక్ష్మీ , విజయలక్ష్మీ, జయలక్ష్మీ, జవాన్ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.






