శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి):జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలంగాణ బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవ బీసీ సామాజిక వర్గానికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి మార్గమని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీల్లోని యాదవులకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బీసీలు, యాదవుల మద్దతు కాంగ్రెస్ వైపు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. యాదవులను, బీసీలను విస్మరించిన పార్టీలకు గతంలో ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరికీ తెలుసని, ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు మర్చిపోవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పించేలా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.






