శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కన్నె స్వాములతో మహా పడి పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత నలభై నాలుగు రోజులుగా అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేసి తన ఆధ్వర్యంలో కన్నె స్వాములతో మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న సంతర్పణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సంఖ్య హాస్పిటల్ MD శ్రీభరత్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






