శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): అహంభావంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూన సత్యం గౌడ్ డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి తాను ఒక ప్రజా ప్రతినిధిని అన్న విషయాన్ని మరిచిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన భార్య, కుమార్తెలను అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగిన విషయం నిజం కాదా.. అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పడంతోపాటు తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ మేరకు సత్యం గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు.