కుమ్మ‌ర బ‌స్తీలో రూ.97వేలు ప‌లికిన గ‌ణేష్ ల‌డ్డూ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని హ‌ఫీజ్‌పేట గ్రామం కుమ్మర బ‌స్తీలో వినాయ‌క న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న కుమ్మ‌ర సంక్షేమ సంఘం, వినాయ‌క ఉత్స‌వ క‌మిటీల‌ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద శుక్ర‌వారం వినాయ‌కుడి ల‌డ్డూల‌కు వేలం పాట నిర్వ‌హించారు. పెద్ద ల‌డ్డూకు గాను నిర్వ‌హించిన వేలం పాట‌లో రంగారెడ్డి అర్బ‌న్‌ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ రూ.97వేల‌కు పాట పాడి గ‌ణేష్ ల‌డ్డూను సొంతం చేసుకున్నారు. అలాగే చిన్న ల‌డ్డూకు నిర్వ‌హించిన వేలం పాట‌లో ల‌డ్డూను రూ.21వేల‌కు కైతాపురం ర‌వితేజ సొంతం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప‌లు కార్య‌క్ర‌మాలు అంద‌రినీ అలరించాయి.

ల‌డ్డూను సొంతం చేసుకున్న కైతాపురం జితేంద‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here