మ‌ల‌బార్ షోరూంలో మైన్ డైమండ్ షో

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌లోని మలబార్ గోల్డ్‌ & డైమండ్స్ షోరూంలో మైన్ డైమండ్ షో గురువారం ప్రారంభ‌మైంది. ఈ షోను న‌టి మ‌రినా అబ్ర‌హాం ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా స్టోర్ హెడ్ దీప‌క్ కుమార్ మాట్లాడుతూ.. పండుగ సంద‌ర్భంగా బంగారం, డైమండ్స్ కొనాల‌నుకునే వారి కోసం ఈ షోను ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు షో కొన‌సాగుతుంద‌ని అన్నారు.

షోలో భాగంగా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన ఆభ‌ర‌ణాల‌ను చూపుతున్న న‌టి మ‌రినా అబ్ర‌హాం

ఈ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. వినియోగ‌దారులు షోకు వ‌చ్చి త‌మ‌కు న‌చ్చిన ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చన్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఆభ‌ర‌ణాల‌ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే వజ్రాల విలువపై 20 శాతం వర‌కు తగ్గింపును అందిస్తున్నామ‌ని తెలిపారు. అన్ని వజ్రాభరణాలకు నాణ్యత హామీతో ఐజిఐ సర్టిఫికేషన్ ఇస్తామ‌ని, 100 శాతం తిరిగి కొనుగోలు హామీ ల‌భిస్తుంద‌ని, ఒక సంవత్సరం బీమా సదుపాయం కల్పించబడుతుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here