మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఆస్తి పన్నులో రాయితీలు కల్పించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.3000 వేతనం పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మియాపూర్లో తెరాస నాయకుడు మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని కల్పించడంతోపాటు కార్మికులకు వేతనాలను పెంచడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రజల బాగోగులను చూస్తారనడానికి ఇది నిదర్శనమన్నారు. వరద సహాయం అందని వారికి కూడా మీ సేవ ద్వారా వరద సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లను పంచుకున్నారు.