- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేద, బడుగు, బలహీన వర్గాల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయటంలో తెరాస ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. 2020-2021 సంవత్సరానికి జిహెచ్ఎంసి పరిధిలో రూ.15 వేల పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీనివ్వటం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయమని అన్నారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కరోనా కష్ట కాలంలో అహర్నిశలు పాటుపడిన పారిశుధ్య కార్మికులకు దీపావళి కానుక గా 3000 రూపాయల వేతనం పెంచి, వారికి అన్ని విధాలుగా తెరాస ప్రభుత్వం తోడు ఉంటుందనే భరోసానివ్వటం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కి అభినందనలు తెలుపుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో, కాలనీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, వార్డు మెంబర్స్ రూప రెడ్డి, గౌరీ, మీనా భి, చాంద్ పాషా, నరసింహ సాగర్, శ్రీనివాస్ చౌదరి, జంగం గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె బలరాం యాదవ్, వైస్ ప్రెసిడెంట్ భీమని శ్రీనివాస్, ఏరియా కమిటీ మెంబర్స్ తిరుపతి యాదవ్, ఇమామ్, రవి శంకర్ నాయక్, మంగమ్మ, కరీం, విజయ్, మహేందర్, తెరాస నాయకులు తిరుపతి, రజనీకాంత్, మహ్మద్ అలీ, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, లక్ష్మి, సీహెచ్ కృష్ణ సాగర్, నందు, అబేద్ అలీ, గిరి గౌడ్, వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, సత్తిబాబు, రామకృష్ణ, గిరి గౌడ్, సత్యం గౌడ్, నాగేశ్వరావు, ఎంఏ సర్తాజ్, సయ్యద్ ఉస్మాన్, సాగర్, సంతోష్, గణపతి, బాబా, చారీ, హినాయత్, యూత్ నాయకులు దీపక్, షేక్ రఫీ, సందీప్, గుల్లు మామ, వెంకటేష్, జుబేర్, అంజాద్, అబ్దుల్ రహీం, హాజి, అమీర్, యాదగిరి, శహబాస్, అంజాద్, అమ్ము, లావణ్య, నసీరుద్దీన్, వసీం, కాలనీ వాసులు పాల్గొన్నారు.