శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): విష్ణు, లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణం పుణ్యప్రదమని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో నిర్వహించిన లలిత పారాయణం, సరస్వతి దేవి పూజలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సరస్వతి దేవి కృపకు పాత్రులయ్యారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ సకల చరాచర సృష్టికి మూలం పరమాత్మ స్వరూపమేనని, అలాంటి పరమాత్మను మనసా వాచా కర్మనా త్రికరణ శుద్ధిగా పూజించాలన్నారు. అందులో భాగంగా మహావిష్ణువు, లలితాదేవి, పరమశివుడిని ఇలా వారి వారి అభీష్టాలకనుగునంగా పారాయణం చేస్తే మంచిదన్నారు. ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వారంలో ఒక రోజైనా ఆలయానికి వెళ్లడం తమ ఇంట్లో భగవన్నామ స్మరణ, సహస్ర నామ స్తోత్రాలు పారాయణం చేయడం పుణ్యప్రదమన్నారు.

ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, గుల్మోహర్ పార్క్ సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవేంద్ర స్వామి, స్వప్న, వీణ, రాణి, వాణి, స్వరూప, వక్ష్యాయిని, మాధవి, సునీత, మంజు, మంజు వాణి, బాలమణి, జె లలిత, పి పద్మావతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.





