విఘ్నేశ్వరుడు అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నాన‌ని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్, చిరంజీవి నగర్, న్యూ కాలనీ, M A నగర్ కాలనీ, P A నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమలలో కాలనీల వారితో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు మియాపూర్ డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here