చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌లో మ‌హా నిమ‌జ్జ‌నానికి స‌ర్వం సిద్దం – కోనేరుల వ‌ద్ద ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించిన డీసీ సుధాంష్ నంద‌గిరి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌లో వినాయ‌క‌ మ‌హా నిమ‌జ్జ‌నానికి స‌ర్వం సిద్ధ‌మైంది. స‌ర్కిల్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, మియాపూర్ గుర్నాథం చెరువు, హ‌ఫీజ్‌పేట్‌లోని ఖాయిద‌మ్మ కుంట వ‌ద్ద నిమ‌జ్జ‌న‌ కోనేరుల‌తో పాటు ప్ర‌కాష్‌న‌గ‌ర్ కొత్త‌కుంట‌, మ‌దీన‌గూడ ఈర్ల చెరువు, దీప్తీ శ్రీన‌గ‌ర్ రేగుల కుంట త‌దిత‌ర ప్రాంతాల్లో గ‌త వారం రోజులుగా వినాయ‌క నిమ‌జ్జ‌నాల ప‌ర్వం కొన‌సాగుతుంది.

గంగారం పెద్ద చెరువులోని కోనేరు వ‌ద్ద వ‌ర్క్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీకాంత్‌ను వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్న డీసీ సుధాంష్ నంద‌గిరి

ఐతే ఆదివారం మ‌హా నిమ‌జ్జ‌నాన్ని పుర‌స్క‌రించుకుని వివిధ విభాగాల సిబ్బందితో క‌ల‌సి జీహెచ్ఎంసీ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంష్ నంద‌గిరి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చూసుకోవాల‌ని కింది స్థాయి సిబ్బందికి సూచించారు.

కొన‌సాగుతున్న వినాయ‌క నిమ‌జ్జ‌న ప‌ర్వం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here