హఫీజ్ పేట్ డివిజన్ ను ఆదర్శంగా చేస్తాం – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: దశల వారీగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో బుధవారం పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 70 లక్షలతో సీసీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. హఫీజ్ పెట్ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ చెప్పారు. అనంతరం హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ లో చేపట్టిన నాలా డీషిల్టింగ్ పనులను పరిశీలించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, హాఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఉమామహేశ్వర రావు, విమల కుమార్, మల్లేష్ గౌడ్, వెంకట సుబ్బయ్య, గోపాల్, లక్ష్మణ్, రవీందర్, కరుణాకర్ గౌడ్, జితేందర్ రెడ్డి, కృష్ణ, సాబేర్ హుస్సేన్, ఉమేష్, మల్లికార్జున్, శ్రీనివాస్, వాసుదేవ్, ఆంజనేయులు రాజు, జె.ఎన్ రావు, పద్మ రావు, హనీఫ్, ఉమేష్, జైపాల్ రెడ్డి, ప్రసాద్, శివరామకృష్ణ, రంగారావు, గోపాల్, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, సుధాకర్, వీరెందర్, జ్ఞానేశ్వర్, హనీఫ్, ఇస్మాయిల్, రాజేందర్, దేవరాజ్, కృష్ణ, వినోద్, వాలి, వెంకట్, గోపి, మహిళలు బీమమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here