లైన్ ఇన్‌స్పెక్ట‌ర్ తెనుగు కిష‌న్ ప‌ద‌వి విర‌మ‌ణ‌

  • శుభాకాంక్ష‌లు తెలిపిన ఐఎన్‌టీయూసీ 327 రాష్ట్ర ఉపాధ్య‌క్షులు వెంక‌టేశ్వ‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో హైద‌ర్‌న‌గ‌ర్ సెక్ష‌న్ లైన్ఇన్‌స్పెక్ట‌ర్‌, ఐఎన్‌టీయూసీ 327 యూనియ‌న్ కుక‌ట్‌ప‌ల్లి డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు, చందాన‌గ‌ర్ శంక‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన‌ తెనుగు కిష‌న్ ఆదివారం ప‌ద‌వి విర‌మ‌ణ పొందారు. ఈ సంద‌ర్భంగా యూనియ‌న్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు, సైబ‌ర్‌సిటీ స‌ర్కిల్ అధ్య‌క్షులు కె.వెంక‌టేశ్వ‌ర్లు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గ‌త 29 సంవ‌త్స‌రాలుగా చందాన‌గ‌ర్‌, మూసాపేట్‌, కొంప‌ల్లి, కొండాపూర్‌, దొమ్మెర పోచంప‌ల్లి హైద‌ర్‌న‌గ‌ర్ సెక్ష‌న్‌ల‌లో తెనుగు కిష‌న్ నిబ‌ద్ధ‌త‌తో విదులు నిర్వ‌హిస్తూ వినియోగ‌దారుల వ‌ద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నార‌ని అన్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన కిష‌న్ శేష జీవితం ఇలాగే ఆనందంగా గ‌డ‌వాల‌ని, వారికి ఆయువు ఆరోగ్య‌ ఐశ్వ‌ర్యాల‌ను ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు.

తెనుగు కిష‌న్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here