బిజెపిలో చేరిన బి.విజయలక్ష్మి సత్యనారాయణ దంపతులు

చందాన‌గ‌ర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జిహెచ్ఎంసి ఎన్నిక‌ల స్వ‌తంత్ర్య కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి బి.విజ‌య‌ల‌క్ష్మి స‌త్య‌నారాయ‌ణ దంప‌తులు బిజెపి లో చేరారు. ఆదివారం క్రిస్ట‌ల్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశంలో బి.విజ‌య‌ల‌క్ష్మీ స‌త్య‌నారాయ‌ణ దంప‌తులు త‌మ అనుచ‌రుల‌తో పార్టీలో చేర‌గా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, శేరిలింగంపల్లి బీజేపీ ఇంచార్జ్ శ్రీ గజ్జల యోగానంద్, శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ లు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు మరియు మోడీ చేస్తున్న అద్భుతమైన అభివృద్ధికి ఆకర్షితురాలినై బీజేపీలో చేరామ‌ని, పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పార్టీ బలోపేతానికి కృషి చేయ‌డంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బిజెపి గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు, కార్య‌కర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ స‌మ‌క్షంలో బిజెపిలో చేరుతున్న బి.విజ‌య‌ల‌క్ష్మి స‌త్య‌నారాయ‌ణ దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here