చిన్నారులకు పోలియో రహిత భవిష్యత్తును అందిద్దాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో బస్తీ ద‌వాఖాన లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్ల‌లోపు పిల్లలందరికీ నిండైన జీవితానికి రెండు చుక్కల‌ పల్స్ పోలియో తల్లిదండ్రులు విధిగా వేయించాలన్నారు. చిన్నారుల‌కు వేసే రెండు చుక్కలు వారి పోలియో రహిత నిండు జీవితానికి అండగా ఉంటుందని అన్నారు. పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయటం వల్ల అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్, సీనియర్ నాయకులు సుమన్, రంగస్వామి ముదిరాజ్, అంగన్వాడీ టీచర్ రాధిక , నర్సింగ్ ఆఫీసర్ వేరోనికా, ఆశ వర్కర్ లత , అంగన్వాడీ హెల్పర్ సుజాత , సపోర్టింగ్ స్టాఫ్ సుధ, వైద్యసిబ్బంది, స్థానిక బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here