హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ కల్లుగీత వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగశేషన్న గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, జీకేవీఎస్ తెలంగాణ ఉపాధ్యక్షుడు గోదా వెంకటేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు ఖాజన్న గౌడ్, శంకర్ గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, పుల్లయ్య గౌడ్ పాల్గొన్నారు.