నమస్తే శేరిలింగంపల్లి : యూపీస్ మదీనాగూడ పాఠశాలలో గురువారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. జగతి, అమెజాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నిరక్షరాస్యత అనేది ఒక మహమ్మారి లాంటిదని, దీనివల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని, కాబట్టి వయస్సు, లింగ భేదము లేకుండా అందరూ చదవాలని, బడిబయట ఉన్న పిల్లలు తమ దగ్గరలో ఉన్న పాఠశాలలో నమోదు తమ బంగారు భవిష్యత్తుగా పునదులు వేసుకోవాలని అన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న జగతి, అమెజాన్ సంస్థల సభ్యులు
జగతి సంస్థ ఫౌండర్ కళ్యాణి మాట్లాడుతూ చదువే లోకానికి వెలుగు కాబట్టి అమ్మాయిలు చదుఫు పట్ల శ్రద్ద వహించి ఉన్నత స్థానానికి చేరుకోగలరని ఆకాంక్షిశారు. అమెజాన్ ప్రతినిధి ఓంకార్ మాట్లాడుతూ ఏదేని అంశం, చదువు అంటే ఉద్యోగం అనే భావన కాకుండా వ్యక్తిత్వ వికాసం గురించి అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన దేశంలో ప్రతి ఒక్కరు అక్షరాస్యులు అనే విధంగా మనమందరం కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రములో మాజీ హెచ్ ఎం డి. విట్టాల్ రెడ్డి, టీచర్లు లీలాదేవి, రామ్మోహన్, సుజాత, మాధవి, శారద, అమెజాన్ సంస్థకు చెందిన ప్రియ, అభిలాష్, జగతి, ‘సభ్యులు అబూబకర్ పాల్గొన్నారు.