నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి మక్తాలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మణికంఠ నాయి బ్రాహ్మణ సంఘం వినాయక మండపాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్, మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజు, నరేష్, రాజు, నగేష్, గోపాల్, తుకారాం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.